Monday, November 25, 2013

I Love you!!!


లోకంలో ఇంత మంది ఉన్నా నువ్వే ఎందుకు గుర్తుకు వస్తున్నావు?
ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి శ్వాస నువ్వే అని ఎందుకు అనిపిస్తున్నావు?
పోనీ నీకు నేనంటే ఇష్టమా?కాదు 
నేనంటే ప్రేమా? లేదు 
ప్రాణమా? కానే కాదు 
లేక ద్వేషమా? అస్సలే కాదు 
ఏమి లేదు 
నువ్వు నన్ను గుర్తు చేసుకుంటావనే ఆశే లేదు 
జీవితం నిర్వీర్యంగా అనిపిస్తుంది 
నీ ఊహలె నన్ను దహించి వేస్తున్నాయి 

ఎవరో అడిగారు ప్రేమంటే ఏంటని?
వాళ్ళకి ఎలా చెప్తే అర్ధం అవుతుంది?

నేను అనుభవిస్తున్న ప్రతి వేదనా , పడుతున్న ఈ నరకయాతనా,
అయినా కూడా తీపిగా అనిపిస్తున్న ఈ భావమే ప్రేమని !!!
నవ్వారు !!!....... 
నువ్వు చెప్పేది బాధ అవుతుంది కాని ప్రేమ ఎలా అవుతుంది అని 
ముళ్ళతో గుచ్చినంత బాధ ఉన్నా నీ ఉహల్లో తేలిపోతున్న నాకు మాత్రమే తెలుసు 
నేను నిన్ను ప్రేమిస్తున్నానని 
నీవు నా వాడివి కాకపోయినా నీ తలపులతో ఆలోచనలతో బ్రతికే ఉన్న.... అవి కూడా ఎక్కడ దూరం అవుతాయో నని?
ఇదే ప్రేమని వాళ్ళకి నేను ఎలా చెప్పను?

Sunday, September 8, 2013

My heart's already broken


It won't be easy this time to hurt me,
My heart's already broken...

I was afraid it would,
when I first saw you,
You don't remember the first time we spoke,do you?
All these years, I felt that you were the one who knew me so well

I was certain it would,
when I felt I was never worth enough for you,
Today you say, I could be the one...

I bet it did,
when I saw those tears in your eyes for your lost love,
I wonder if you felt the same for me ever?
Do you even remember it was your first touch?
My hands in yours and your face in my hands...
For a second, my heart skipped a beat

Or did it?
when I knew you never felt the same...
It hurts...it pains like hell...
but what am I gonna do?

Yes, My love, my heart broke into a million pieces,
not when you became someone else's,
but yes...when you left me forever...
and yes...when you said I could be the one...

Yes, it won't be easy this time to hurt me,
because my heart's already broken,
and each little piece of it loves you...

I am jealous of everyone that's ever hugged u,
even though for a second,
they held my entire world

Thursday, August 8, 2013

స్నేహమా ...ప్రేమించాను నిన్ను





ప్రేమించాను నిన్ను............ 

స్నేహం ఎపుడు ప్రేమగా మారిందో తెలీనంత !
నీ హృదయం బాధపడితే నా కంట నీరు వచ్చేటoత !

ఎంత దగ్గరైనా నీకు నాకు మధ్య ఉన్న అంతులేని దూరం అంత !
ఎంత చేరువైనా నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత !

నీ కన్నుల్నే చూస్తూ కాలాలే దాటేటoత !
నా వెతల్నే దాచి నిన్ను నవ్వించేటoత !








నీకు ఎదురుపడినపుడు ఎదలో రగిలే ఎడబాటoత !  
మదిలో రగిలే వేదనకి నన్ను ఓదార్చే  నీ పిలుపంత !

నాలోనే నాతోనే ఉండలేనంత !
ప్రాణాలే పోతున్నా నిన్ను నిందిoచలేనంత !

తెలీదు ఎప్పుడు ప్రేమించానో 
కాని 
ప్రేమించాను నిన్ను!!!

తిరుగులేని శాపమా?


ఏ నాటిదో నీతో స్నేహం 
మారిందా ఈ లోకం 
ఇన్నాళ్ళుగా వేచిన స్నేహం 
ఈనాటితో దూరం 
మదిలో మెదిలే నీదా రూపం 
తీయటి స్నేహం ప్రేమేనా?
చేరువ కాని నీతో బంధం 
తిరుగులేని శాపమా?

Monday, July 15, 2013

మన మిద్దరమే


అందమైన కలల తీరo తాకాలని ఉంది ..... నీతో
నా అందమైన ప్రపంచంలో నేను...నువ్వు..

నీ నీడనైనా  తాకాలని ఉంది
ప్రతి ఉదయం ఉషోదయమై నీ ముంగిట నిలవాలని ఉంది
చల్లటి గాలినై... పరిమళించు పూవునై... నీ ఎదపై ఒదిగిపోవాలని ఉంది
నీ కనురెప్పలపై తీయటి కలనై మిగిలిపోవాలని ఉంది
వెన్నెలై కురవాలని...నీ పెదవులపై మౌనమై మిగలాలని ఉంది
నీవు నిదురపోయే వేల జోలనై... చెరగని కలనై... నీ పెదవులపై దరహసంగా విరియాలని ఉంది
కాని  నువ్వు నా చేతికందని చందమామాలా,నన్ను 'నేనేంటి?' అని ప్రశ్నిoచుకునేలా  చేస్తున్నావు
చెప్పు?... ఇంతకీ  నేనేంటి?
నువ్వు .... నీ ప్రపంచం.... అందులో నే లేనా?