Monday, November 25, 2013

I Love you!!!


లోకంలో ఇంత మంది ఉన్నా నువ్వే ఎందుకు గుర్తుకు వస్తున్నావు?
ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి శ్వాస నువ్వే అని ఎందుకు అనిపిస్తున్నావు?
పోనీ నీకు నేనంటే ఇష్టమా?కాదు 
నేనంటే ప్రేమా? లేదు 
ప్రాణమా? కానే కాదు 
లేక ద్వేషమా? అస్సలే కాదు 
ఏమి లేదు 
నువ్వు నన్ను గుర్తు చేసుకుంటావనే ఆశే లేదు 
జీవితం నిర్వీర్యంగా అనిపిస్తుంది 
నీ ఊహలె నన్ను దహించి వేస్తున్నాయి 

ఎవరో అడిగారు ప్రేమంటే ఏంటని?
వాళ్ళకి ఎలా చెప్తే అర్ధం అవుతుంది?

నేను అనుభవిస్తున్న ప్రతి వేదనా , పడుతున్న ఈ నరకయాతనా,
అయినా కూడా తీపిగా అనిపిస్తున్న ఈ భావమే ప్రేమని !!!
నవ్వారు !!!....... 
నువ్వు చెప్పేది బాధ అవుతుంది కాని ప్రేమ ఎలా అవుతుంది అని 
ముళ్ళతో గుచ్చినంత బాధ ఉన్నా నీ ఉహల్లో తేలిపోతున్న నాకు మాత్రమే తెలుసు 
నేను నిన్ను ప్రేమిస్తున్నానని 
నీవు నా వాడివి కాకపోయినా నీ తలపులతో ఆలోచనలతో బ్రతికే ఉన్న.... అవి కూడా ఎక్కడ దూరం అవుతాయో నని?
ఇదే ప్రేమని వాళ్ళకి నేను ఎలా చెప్పను?

No comments: