Monday, July 15, 2013

మన మిద్దరమే


అందమైన కలల తీరo తాకాలని ఉంది ..... నీతో
నా అందమైన ప్రపంచంలో నేను...నువ్వు..

నీ నీడనైనా  తాకాలని ఉంది
ప్రతి ఉదయం ఉషోదయమై నీ ముంగిట నిలవాలని ఉంది
చల్లటి గాలినై... పరిమళించు పూవునై... నీ ఎదపై ఒదిగిపోవాలని ఉంది
నీ కనురెప్పలపై తీయటి కలనై మిగిలిపోవాలని ఉంది
వెన్నెలై కురవాలని...నీ పెదవులపై మౌనమై మిగలాలని ఉంది
నీవు నిదురపోయే వేల జోలనై... చెరగని కలనై... నీ పెదవులపై దరహసంగా విరియాలని ఉంది
కాని  నువ్వు నా చేతికందని చందమామాలా,నన్ను 'నేనేంటి?' అని ప్రశ్నిoచుకునేలా  చేస్తున్నావు
చెప్పు?... ఇంతకీ  నేనేంటి?
నువ్వు .... నీ ప్రపంచం.... అందులో నే లేనా?

No comments: