నిజం చెప్పనా?
నా మనసు ముక్కలయింది
అయినా ఇంకా దేనికోసమో ఎదురుచూస్తుంది
నీ కోసమేనా?
అనుమానమే !!!
తప్పు నాదంటావా
అది నీకే తెలియాలి
ప్రయత్నించాను..
ఎన్ని సార్లో లెక్క పెట్టుకోలేదు మరి
కాలం తో పరిగెట్టాను
లోకమే తెలీకుండా బతికేసాను
ఈ రోజు ఆగి చూస్తే
నిశబ్ధం.....
బయం వేసింది
నా చుట్టూ ఇంత మంది ఉన్నా
ఎందుకింత నిశబ్దం?
మరచిపోనా నిన్ను
కాస్త ఎలాగో చెప్పవా?
గుండెలో నొప్పిగా ఉంది
ఆగు మళ్లీ వస్తా!!!
No comments:
Post a Comment