ఎక్కడి నుండి వచావో నీవు
స్నేహ మాధుర్యాన్ని రుచి చూపించి రివ్వున ఎగిరిపోయావు
నా కలను కలగా మిగిల్చిపోయావు
స్నేహం నుండి ప్రేమ కలిగిందా
లేక ప్రేమ నుండి స్నేహమా?
స్నేహ భావం మిగిల్చావో
లేక ప్రేమ జ్వాల రగిల్చావో
లేక ప్రేమ జ్వాల రగిల్చావో
చెరగని చిరునవ్వు మాత్రం నేర్పిన్చావు
కనుపాపంటి నా హృదయాన్ని రాయిలా చేసావు
ఒక తీపి జ్ఞాపకంలా మిగిలి పోతున్నావు
క్షమించలేవా ఈ నేస్తాన్ని
వీడి పోనికు ఈ బంధాన్ని
రివ్వున ఎగసే స్నేహ కెరటాన్ని అందుకో జూశాను
చేతిలో చెమ్మతో మిగిలిపోయాను
చిరునవ్వుతో వద్దని వారింప చూసావు నన్ను
చిలిపి అల్లరితో అందుకో చూసాను నిన్ను
ఉహల్లో తెలిపోయాను
మనసు ముక్కలై మిగిలిపోయాను
తప్పు తెలిసింది కాని బంధం చేయి జారింది
వెనకకి తిరగని కాలం నన్ను వెక్కిరిస్తుంది
ఏమి చేయలేని నా హృదయం అలమటిస్తుంది
తిరిగి రారాదా నేస్తం
నీ స్నేహం ముఖ్యం